ఆధార్ కార్డుల్లో డేటా మార్పిడి చేస్తున్న ముఠా గుట్టురట్టు

ఆధార్ కార్డుల్లో డేటా మార్పిడి చేస్తున్న ముఠా గుట్టురట్టు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 మంది అరెస్టు

ప్రభుత్వ సంక్షేమ ఫథకాల లబ్ది  పేరిట  మోసాలు

ఆరేటర్లదే కీలక పాత్ర…. వేల సంఖ్యలో లబ్ది దారులు

కర్నూలు: ఆధార్ కార్డుల్లో  డేటాను అక్రమంగా మార్పిడి చేస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా పెట్టిన పోలీసులకు ఆధార్ కార్డుల ట్యాంపరింగ్ ముఠా ఆనవాళ్లు జిల్లా వ్యాప్తంగా విస్తరించినట్లు తెలియడంతో..  పక్కా ఆధారాలతో.. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో ఒక్కరోజే మొత్తం 30 మంది పట్టుపడ్డారు. ముఠా ఇంకా ఎన్ని ప్రాంతాలకు విస్తరించి ఉందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారిస్తున్నారు. మరికొంత మంది వీరితో జత కలిశారేమోనని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 30 మందిని  అరెస్టు చేసిన సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మీడియా సమావేశంలో దాడుల్లో పాల్గొన్న  ట్రైనీ ఐపియస్ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ , సిఐలు  సురేష్ బాబు,  పి. శ్రీరాములు, మహేశ్వరరెడ్డి ,  ఎస్సైలు , కానిస్టేబుళ్లతోపాటు మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నిందితులు ఆధార్ కార్డుల్లో డేటాను ఎలా ట్యాంపర్ చేసే వారో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప మీడియాకు వివరించారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో ముఠాలుగా ఏర్పడి మోసాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ప్రాథమిక దర్యాప్తులో బయటపడిన వివరాలు ఇలా ఉన్నాయి…

ప్రభుత్వ సంక్షేమ ఫథకాల లబ్ధి  పేరిట  మోసాలకు పాల్పడుతున్నారు.

ఆధార్ కార్డుల్లో డేటా మార్పిడిలో ఆరేటర్లదే కీలక పాత్ర.

లబ్ది దారులు వేల సంఖ్యలో ఉన్నట్లు బయటపడింది.

భారీగా కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు దానికి సంబంధించిన పరికరాలు స్వాధీనం.

ఆధార్ కార్డుల డేటా మార్పిడి చేస్తున్న ముఠాలపై  సమాచారం వచ్చిన వెంటనే నిఘా పెట్టి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దాడులు నిర్వహించాం.

ఇవాళ ఒక్కరోజే వీరందరిని ఈ రోజు ఆయా పోలీసుస్టేషన్ ల పరిధులలో అరెస్టు.

ఆధార్ కార్డుల మార్పిడి.. నేరం చేసే విధానాలు

జగనన్న చేయూత, ఆసరా, వైయస్ పెన్సన్, నేతన్న నేస్తం) ప్రభుత్వ సంక్షేమ ఫథకాలలో  అర్హులై లబ్ది పొందుటకు ఆధార్ కార్డులలో పుట్టిన తేదిలు  మార్పిడి చేస్తున్నారు.

పాన్ కార్డు లేని వారికి నకిలీ పాన్ కార్డు సృష్టించడం, ఫోటోషాప్, మైక్రోసాఫ్ట్ పేయింట్ లో డేటాను ఎడిట్ చేస్తున్నారు.

పాన్ కార్డులు ఆధారం చేసుకుని ఆధార్ కార్డులలో పుట్టిన తేది మార్చడం

దళారులను ఏర్పాటు చేసుకుని ఏజెంట్ల ద్వారా 5 వేలు, 6 వేలు తీసుకుని కార్డులు మార్పిడి చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

ఒక్కో దళారి 100 మంది పైగా అప్లికేషన్ లు మార్పిడి చేయిస్తున్నారు.

ఈ విధంగా వేల సంఖ్యలో కార్డులు మార్పిడి చేస్తున్నట్లు బయటపడింది.  ప్రాథమిక స్ధాయిలో నే ఇంత బయటపడింది. ఇంకా పూర్తిగా చేయాల్సి ఉంది.

కేవలం 10 సచివాలయలలో దాడులు చేస్తే 200 అప్లికేషన్ ల వరకు మోసాలకు పాల్పడినట్లు బయటపడింది..ఇంకా బయటపడాల్సినవి చాలా ఉన్నట్లు తెలుస్తోంది.

పత్తికొండ  రూరల్  సర్కిల్ పిఎస్ పరిధి  లో 14 మంది  అరెస్టు.

(గతంలో ఇదే కేసులో 8 మంది అరెస్టు)

1)    కె. రామంజనేయులు(27) 2) ప్రసాద్ (26) 3) చంద్రశేఖర్ (27) 4) రామంజనేయులు (34), 5) బోయ వీరేష్ (26) , 6)  రవి(27), 7)  మల్లప్ప(38)  8) హనుమంతరెడ్డి (25) , 9)  హేమంత్ రెడ్డి (35), 10)  వెంకటేష్ (35)  11) అయ్యన్న(27) , 12)  రమేష్ (23) , 13) బాలప్ప(34), 14)  నగేష్ (30).  వీరందరూ  కోసిగి, కౌతాళం,  ఆదోని, పత్తికొండ, పెద్దతుంబంళం ప్రాంతాలకు చెందినవారు.

నందవరం  పోలీసు స్టేషన్  పరిధిలో ఇద్దరి అరెస్టు

1) వీరేష్ (30) ఎమ్మిగనూరు ,  2) విజయ్ మోహన్ రెడ్డి(31) పెద్ద కడుబూరు. వీరి వద్ద నుండి ఒక ల్యాప్ టాప్,  స్కానర్స్ , ప్రింటర్, ఐరిష్ , తంబ్ స్కానర్స్ , కెమెరా , అప్లికేషన్స్ , ఆధార్ సెంటర్ పరిమిషన్ పత్రం సీజ్, ఇతర పరికరాలు స్వాధీనం.

ఆదోని 3వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో నలుగురి అరెస్టు

1.మాబ్బాష (ఇస్వి గ్రామం) 2) సత్యనారాయణ, 3) మహమ్మద్ ఆలీ, 4) పి. హుస్సేన్.  వీరందరిది (ఆదోని టౌన్)

బనగాన పల్లె సర్కిల్ పోలీసు స్టేషన్ పరిధిలో  6 మంది అరెస్టు

1.ఉప్పరి మద్దిలేటి (44), 2) చాకలి నాగరాజు (30), 3) కావలి రామాంజినేయులు(35), 4) అప్పల్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి(23) 5) పోలూరు పుల్లయ్య (52)  6)వర మహేంద్ర(29) వీరు బనగానపల్లె, అవుకు, తాడిపత్రి, పాణ్యం, గుంతకల్లు పట్టణాలకు చెందిన వారు. వీరి వద్ద నుండి 3 ల్యాప్ ట్యాప్ లు, 3 ఫింగర్ ఫ్రింట్ స్కానర్స్ , 3 ఐరిష్ స్కానర్స్ , 3 వెబ్ కెమెరాలు, 3 స్కానర్ & ప్రింటర్ దానికి సంబంధిచిన పరికరాలు స్వాధీనం.

ఆదోని 2 టౌన్ పిఎస్ లో 4 గురు అరెస్టు

1)    అరవింద్(44), 2) రాజు(29), 3)  షేక్షావళి(30) 4) ఐశ్వర్య (21)   వీరందరు ఆదోనికి చెందిన వారు). వీరి వద్ద కంప్యూటర్ లు , ల్యాప్ ట్యాప్ లు దానికి సంబంధించిన పరికరాలు స్వాధీనం.

For more news…

ఒత్తిడి నుండి రిలాక్స్ కోసం కొత్త కాన్సెప్ట్

బ్రెయిన్ స్ట్రోక్ వస్తే.. ఇంజెక్షన్ తో నయం చేయవచ్చు