దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న సమ్మె

దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న సమ్మె

దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ... కార్మిక సంఘాలు నిన్న సమ్మె చేపట్టారు. సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. బ్యాంకింగ్, ప్రజారవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు యథావిథిగా కొనసాగాయి. అత్యవసర సేవలకు ఎలాంటి విఘాతం కలగలేదు. 

సమ్మెలో ఐఎన్ టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ. ఎస్ఈడబ్ల్యూ ఏ, ఎల్ పీఎఫ్, యూటీయూసీ జాతీయ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటైజేషన్ తక్షణమే విరమించుకోవాలని,జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నాయి కార్మిక సంఘాలు.

మరిన్ని వార్తల కోసం

 

గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు తుక్కుతుక్కు

13 ఏండ్లకే సొంత బ్రాండ్..లక్షల్లో సంపాదన