పెళ్లి చేసుకోవాలనుకున్నారు..కానీ అంతలోనే ఆత్మహత్య

పెళ్లి చేసుకోవాలనుకున్నారు..కానీ అంతలోనే ఆత్మహత్య

మంచిర్యాల జిల్లాలో అనుమాన్పదంగా ఓ ట్రాన్సజెండర్, ఓ అమ్మాయి ఆత్మహత్యకు యత్నించారు.  రామకృష్ణాపూర్ సమీపంలోనీ అటవీ ప్రాంతంలో  ట్రాన్స్ జెండర్ మహేశ్వరి, అంజలి అనే అమ్మాయి  గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన స్థానికులు తీవ్ర గాయాలతో ఉన్న అంజలి, మహేశ్వరిలను  మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  అప్పటికే అంజలి మృతి చెందినట్లు డాక్టర్లు గుర్తించారు. మహేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఏం జరిగింది..?

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ట్రాన్స్ జెండర్ మహేశ్వరీ, అంజలి ఒకే గదిలో అద్దెకు ఉంటున్నారు. వీరిద్దర ప్రేమించుకున్నారని... పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఒకే రూంలో కలిసి ఉంటున్నట్లు సమాచారం. అయితే ఇటీవల అంజలికి మహేశ్వరికి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని స్థానికులు తెలిపారు. వివాహ విషయంలో వీరిద్దరి మధ్య ఘర్షణ ఏర్పడిందని చెబుతున్నారు.  అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ..వీరిద్దరు బుధవారం రామకృష్ణాపూర్ సమీపంలోని అడవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ గొంతుకోసుకుని సూసైడ్కు యత్నించారు. 

 
హత్య చేశారని ఆరోపణ...

డాక్టర్ల  సమాచారంతో  మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరోవైపు అంజలిని గొంతుకోసి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అంజలి మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.