ఎమ్మెల్యేకి ప్ర‌పోజ్ చేసిన అమ్మాయి.. వెరైటీ రిప్లై ఇచ్చిన నేత‌

V6 Velugu Posted on Jul 31, 2021

మంచి గ్లామ‌రస్ లుక్ ఉన్న యువ‌ నేత‌ల‌కు ప్ర‌పోజ‌ల్స్ రావ‌డం కొత్తేంకాదు. గ‌తంలో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌కు అమ్మాయిల నుంచి లెట‌ర్స్ వ‌చ్చేవ‌ని ఆయ‌నే చెప్పిన సంద‌ర్భాలున్నాయి. ఇక ఢిల్లీలోని రాజీంద‌ర్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే, ఆమ్ ఆద్మీ పార్టీ నేత 32 ఏండ్ల‌ రాఘ‌వ్ చ‌ద్ధాకు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ గురించిప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారం టైమ్‌లోనూ ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో అనేక ప్ర‌పోజ‌ల్స్ వ‌చ్చాయి. ఇప్పుడు పంజాబ్ ఎన్నిక‌ల‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రిపేర్ అవుతున్న వేళ మ‌రోసారి రాఘ‌వ్‌కు అలాంటి అనుభ‌వం ఎదురైంది. 

క‌రెంట్ వ‌ద్దు.. ఆయ‌నే కావాలి!

పంజాబ్ ఎన్నిక‌ల్లో ఆప్‌ను గెలిపిస్తే 24 గంట‌ల క‌రెంట్ స‌ప్లైతో పాటు 300 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ పొంద‌వ‌చ్చ‌ని ఆ పార్టీ ఇచ్చిన హామీని ప్ర‌స్తావిస్తూ గురుదీప్ అనే నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. దానికి కీర్తీ ఠాకూర్ అనే మ‌హిళ స్పందిస్తూ త‌న‌కు క‌రెంట్ వ‌ద్ద‌ని, రాఘ‌వ్ కావాల‌ని ట్వీట్ చేసి.. ప‌రోక్షంగా ఆయ‌న‌కు ప్ర‌పోజ్ చేసింది. ఇది రాఘ‌వ్ దృష్టికి రావ‌డంతో ఆమె ట్వీట్‌కు ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. తాను మ్యానిఫెస్టోలో లేన‌ని, ఫ్రీ క‌రెంట్ మాత్ర‌మే ఉంద‌ని చెబుతూ రాఘ‌వ్ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్‌కు ఓటేస్తే ఉచిత క‌రెంట్ అందుతుంద‌ని హామీ ఇస్తున్నాన‌ని, 24 గంట‌ల క‌రెంట్ అందుతుంద‌ని చెప్పారు. కానీ త‌న విష‌యంలో ఈ క‌మిట్‌మెంట్ ఇవ్వ‌లేన‌ని ఆయ‌న చెప్పారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న స్క్రీన్ షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్ చేశారు. Kejriwal di guarantee  అన్న హ్యాష్ ట్యాగ్‌తో ఆమ్ ఆద్మీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రెఫ‌ర్ చేస్తూ దీనిని పోస్ట్ చేశారు.

 

Tagged Twitter, love proposal, Free Electricity, MLA Raghav Chadha

Latest Videos

Subscribe Now

More News