బస్సు బీభత్సం.. వ్యక్తి మృతి.. టూవీలర్స్ ధ్వంసం

బస్సు బీభత్సం.. వ్యక్తి మృతి.. టూవీలర్స్ ధ్వంసం

ఢిల్లీలోని రోహిణి ఏరియాలో ప్రభుత్వ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన బస్సు.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని వ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు వారికి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

కారును ఢీకొన్న తర్వాత కూడా బస్సు స్పీడ్ తగ్గకపోవడం వల్ల అది అదుపు తప్పి ఓ ఆటోను ఢీ కొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న 9 టూవీలర్స్ ఢీకొట్టింది. దీంతో అవన్నీ ధ్వంసమయ్యాయి. ప్రయాణికులను దించిన తర్వాత బస్సు డిపోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

డ్రైవర్​కు మూర్చ రావడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్​కు మూర్చ రావడం వల్లే ప్రమాదం జరిగిందా..? లేక మద్యం మత్తులో జరిగిందా..? అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.