
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న చిత్రం‘పెద్ది’ (PEDDI). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూణేలో జరుగుతోంది. ఈ కొత్త షెడ్యూల్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. లేటెస్ట్గా ఈ పాటకు సంబంధించిన ఓ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇందులో హీరో చరణ్ ఓ ఎత్తైన కొండ ప్రాంతంలో డ్యాన్స్ స్టేప్పులు వేస్తున్నారు. ఇది చాలా హై రిస్కీ షాట్లా కనిపిస్తోంది. చుట్టూరా లోయ, మరోవైపు ఎండిపోయిన చెట్టు కొమ్మపై చెర్రీ ఓ కాలు, మరో కాలు స్లోప్ ఉన్న బండరాయిపై, ఇలా తన బాడీని, తన మనసుని బ్యాలెన్స్ చేసుకుంటూ స్టెప్పులు వేశారు చరణ్. ఇది కేవలం సాంగ్లో ఒక్క స్టెప్ మాత్రమే. మొత్తం సాంగ్స్లో ఇంకా ఎలాంటి స్టెప్స్ ఉండనున్నాయో అర్ధం చేసుకోండి.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాపై చూపిస్తున్న చెర్రీ డెడికేషన్కు, మెగా ఫ్యాన్స్తో పాటుగా నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ‘సినిమా కోసం ప్రాణాలు లెక్కచేయకుండా చేస్తున్న రామ్ చరణ్ సాహసానికి కుదాస్’, ‘చరణ్ ఈజ్ రీల్ హీరో కాదు.. రియల్ హీరో’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Bro takes risks like rusk 🙌
— Doctordeath☠ (@yugeshroyal1) October 10, 2025
No contemporary hero is even willing to shoot outdoors but you are a mad man @AlwaysRamCharan 💪🙏 pic.twitter.com/zm8zivkydU
ఇకపోతే, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ సాంగ్ విజువల్ ట్రీట్‌గా ఉండబోతోందని టాక్. ఈ స్టెప్ థియేటర్లలో వచ్చినప్పుడు మాత్రం ఆడియన్స్కు గూస్బంప్స్ రావడం పక్కా అనే తెలుస్తోంది. చాన్నాళ్ల పాటు గుర్తుండిపోయేలా రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
#Peddi – an @arrahman Sir musical ❤🔥
— BuchiBabuSana (@BuchiBabuSana) September 1, 2025
The maestro has captured the soul and emotion of #Peddi like never before.
Our first single is coming soon - stay tuned!@AlwaysRamCharan @vriddhicinemas @PeddiMovieOffl pic.twitter.com/xqUvAmlZqK
ఇప్పటికే, రెహమాన్ మొత్తం సాంగ్స్తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సిద్ధం చేసి ఉంచారంట. త్వరలో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. అందుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చక చకా నడుస్తున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అరవై శాతం వరకూ షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సైమల్టేనియస్‌గా జరుపుకుంటుంది.
►ALSO READ | ‘అరి’ సినిమా నడుస్తున్న ఆర్టీసీ క్రాస్ రోడ్ సప్తగిరి థియేటర్ దగ్గర ఉద్రిక్తత
బడ్జెట్ విషయంలో పెద్ది నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే, 1980 నాటి విజయనగరం పట్టణాన్ని తలపించేలా విశాలమైన సెట్‌ను హైదరాబాద్ శివార్లలో నిర్మించారు. గ్రామంలో గృహాలు, వీధులు, రైల్వే స్టేషన్, క్రీడా మైదానం వంటి సెట్స్‌ను సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, దర్శక నిర్మాతలు సర్వశక్తులా ఒడ్డుతున్నారు.
ఈ సినిమాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.