
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ లో పర్యాటకులతో వెళ్తున్న హెలికాప్టర్‌కు భారీ ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉద యం 7 గంటల సమయంలో సాంకేతిక లోపంతో ఓ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాం డింగ్ అయింది. ఈ ఘటనలో పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సిర్సి హెలిప్యాడ్ నుంచి ఆరుగురు పర్యాటకులతో కేదార్‌నాథ్‌కు ఓ హెలికాప్టర్ బయలుదేరింది.
కొండపైకి చేరుకోగానే హెలికాప్టర్ వెనుక మోటార్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తు న్న సమయంలో హెలికాప్టర్ అదుపుతప్పి గాల్లో చక్కర్లు కొడుతూ.. హెలిప్యాడ్ వద్ద కాకుండా 100 మీటర్ల దూరంలో ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్ సౌరభ్ గహర్వార్ తెలిపారు.