ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వెనుకున్న మతలబేంటి..? పువ్వాడ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వెనుకున్న మతలబేంటి..? పువ్వాడ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు బీఆర్ఎస్ పార్టీకి సడెన్ గా ఎందుకు గుర్తొచ్చింది..? కమ్మ సామాజిక వర్గం నేతలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకేనా..? ఇంకేమైనా కారణం ఉందా..? మంత్రి పువ్వాడ జూనియర్ ఎన్టీఆర్ ను విగ్రహావిష్కరణకు ఆహ్వానించడం వెనుకున్న మతలబేంటి..? 

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ ఏర్పాటు చేయడంపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ టైమ్ లోనే జిల్లా కేంద్రంలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ ను మంత్రి అహ్వానించడం మరింత ఇంట్రెస్ట్ గా మారింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా టీడీపీ కంచుకోట. ఎన్టీఆర్ పై అభిమానం ఒక కారణమైతే.. కమ్మ సామాజిక వర్గం నాయకులు మరో రీజన్. దశాబ్దలుగా కమ్మ సామాజిక వర్గం నేతలు ఖమ్మం జిల్లాపై తమదైన ముద్ర వేశారు. జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ఓటర్ల సంఖ్య తక్కువే అయినా.. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆ సామాజిక వర్గం నేతలదే ఆధిపత్యం. టీఆర్ఎస్ గా ఉన్న టైమ్ లో కమ్మ సామాజిక వర్గానికి KCR పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదన్న అభిప్రాయం ఉంది. TRS కాస్త BRSగా మారిన తర్వాత కేసీఆర్ రూట్ మార్చినట్టు కనిపిస్తోంది.

కమ్మ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు.. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దూరమవుతన్న కమ్మ సామాజిక వర్గం నేతలకు..దగ్గర కావడం కోసం ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రతో పాటు హైదారాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలో కొంత ప్రభావం ఉంటుందని BRS లీడర్ల ఆలోచనట. అందుకే ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ జయంతికి..ఎన్టీఆర్ ఘాట్ లో BRS లీడర్లు నివాళులు కూడా అర్పించారు. 

ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు పిలిచారనే దానిపై మరో చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పువ్వాడ అజయ్ స్వయంగా.. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లి ఆహ్వానించారు. రాజకీయాలకు దూరంగా.. సినిమాలకే పరిమితమైన జూనియర్ ని పిలవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ మనుమడు కాబట్టే పిలిచామని.. రాజకీయాలతో సంబంధం లేదని చెప్తున్నారు మంత్రి సన్నిహితులు.

https://www.youtube.com/watch?v=j16I-72AJTM