సంగారెడ్డి జిల్లా జిన్నారంలో భారీ అగ్నిప్రమాదం 

సంగారెడ్డి జిల్లా జిన్నారంలో భారీ అగ్నిప్రమాదం 

సంగారెడ్డి జిల్లా జిన్నారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గడ్డిపోతారం ఇండస్ట్రీ ఏరియాలోని లీ ఫార్మా కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో వెంటనే కార్మికులు, ఉద్యోగులు భయంతో కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేస్తున్నారు.