అక్కన్నపేటలో రోడ్డుపై కూలిన భారీ చింత చెట్టు

అక్కన్నపేటలో రోడ్డుపై కూలిన భారీ చింత చెట్టు
  • రామాయంపేట మండలం అక్కన్నపేటలో ఘటన
  • ప్రమాదంలో ఆటో, బైక్ ధ్వంసం, ఇద్దరికి గాయాలు
  • రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్

రామాయంపేట, వెలుగు: మెదక్​ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో.. మెదక్–సిద్దిపేట రహదారిపై మంగళవారం భారీ చింత చెట్టు నేలకూలింది.ఈ ప్రమాదంలో ఆటో,  బైక్  ధ్వంసం కాగా ఇద్దరికి గాయాలయ్యాయి. గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న చింత చెట్టు ఒక్కసారిగా నేలకూలడంతో రోడ్డుపై వెళ్తున్న ఆటో, బైక్ పై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా భారీ చెట్టు పడడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్  నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, జేసీబీతో చెట్టును తొలగించి ట్రాఫిక్​ క్లియర్  చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.