
సిమ్లా : చిరుత పులిని గుర్తు తెలియని దుండగులు తుపాకితో కాల్చి చంపారు. ఈ ఘటన శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు సమీపంలోని హీరానగర్ లో జరిగింది. ఈ ఘటనపై సిమ్లా డివిజన్ ఫారెస్టు ఆఫీసర్ సుశీల్ రానా మాట్లాడుతూ.. హీరా నగర్ లో చిరుత మృతదేహం లభ్యమైందని తెలిపారు. ఆ తర్వాత చిరుత కళేబరాన్ని పోస్టుమార్టంకు తరలించామని.. దాని మెడపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని సుశీల్ రానా చెప్పారు. పులిని చంపేసిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.