బీజేపీ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు

బీజేపీ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్: బీజేపీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయింది. బండిసంజయ్ మూడోవిడత పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా.. రేపు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. పోలీసులు సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో.. హైకోర్టులో పిటిషన్ వేశారు బీజేపీ నేతలు. సభకు అనుమతిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. బీజేపీ పిటిషన్ విచారణకు స్వీకరించింది కోర్టు. మధ్యాహ్నం రెండున్నరకు జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ బీజేపీ పిటిషన్ పై విచారణ జరపనుంది.

బండిసంజయ్ పాదయాత్ర ఆపాలంటూ ప్రభుత్వం మరోసారి కోర్టుకెళ్లింది. నిన్న సంజయ్ ప్రజాసంగ్రామయాత్రకు హైకోర్టు సింగిల్ జడ్జి అనుమతిచ్చారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ..లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. అప్పీల్ పై అత్యవసర విచారణ చేపట్టాలని స్టేట్ సర్కార్ సీజే ధర్మసనాన్ని కోరింది. పాదయాత్ర కొనసాగితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని  ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర సర్కార్ అప్పీల్ పై మధ్యాహ్నం ఒంటిగంట 15నిమిషాలకు విచారణ జరిపేందుకు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం అంగీకరించింది.