నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లబోయి..

నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లబోయి..

రాత్రివేళ ఆరుబయట నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారిని ఓ ఆగంతకుడు ఎత్తుకెళ్లబోయాడు. పంజాబ్ రాష్ట్రం లూథియానాలో జరిగిందీ సంఘటన. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. స్థానికంగా ఉన్న రిషినగర్ లో ఓ కుటుంబం ఇంటి ముందు నిద్రిస్తుండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి రిక్షా సైకిల్ తో వారి సమీపానికి వచ్చాడు. మంచం మీద నిద్రపోతున్న పాపను తన రిక్షా మీద పడుకోబెట్టి తీసుకెళ్లబోయాడు.

పక్కనే మరో మంచంపై నిద్రిస్తున్న మహిళ ఆ అలికిడి విని వెంటనే అతడి నుంచి ఆ బిడ్డను లాక్కుంది.  ఇంటి లోపల నిద్రిస్తున్న మిగతా కుటుంబ సభ్యుల్ని కూడా లేపి అతని గురించి తెలిపింది. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆ ఆగంతకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.