కుల్సుంపురలో ఫైనాన్సర్ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య

కుల్సుంపురలో ఫైనాన్సర్ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య

రోజురోజుకి ఫైనాన్షియర్ల వేధింపులు పెరిగిపోతున్నాయి. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఫైనాన్సర్ వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఫైనాన్సర్ వేధింపులు తట్టుకోలేక నిజాముద్దీన్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజాముద్దీన్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆరు నెలలుగా అతడు ఖాళీగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. 

నిన్న మధ్యాహ్నం మృతుడి భార్య పనికోసం బయటికి వెళ్లింది. తిరిగి ఆమె సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నిజాముద్దీన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించింది. ఏం చేయాలో అర్థంకాక చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. తన భర్త చనిపోవడానికి ఫైనాన్సర్ వేధింపులే కారణమని ఆమె తెలిపింది. స్పందించిన స్థానికులు వెంటనే కులుసుంపుర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫైనాన్సర్ కోసం ఆరా తీస్తున్నారు. వివరాలు తెలిసిన వెంటనే ఘటన పై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.