
వెంకటాపురం, వెలుగు : ఫ్రిడ్జ్ డోర్ తీస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఆదివారం జరిగింది. ఎస్సై కొప్పుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పాత్రపురం గ్రామానికి చెందిన రానిబోయిన నరేశ్‌బాబు (32) ఆదివారం తన ఇంట్లోని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు.
డోర్‌ను ముట్టుకోగానే షాక్ కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబసభ్యులు నరేశ్‌ను వెంకటాపురం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ సీఆర్‌పీ చేసినా ఫలితం లేకపోవడంతో నరేశ్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడు నరేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.