గ్యాస్ సిలిండర్ పేలి యువకుడు మృతి..సంగారెడ్డి జిల్లాలో ఘటన

గ్యాస్ సిలిండర్ పేలి యువకుడు మృతి..సంగారెడ్డి జిల్లాలో ఘటన

రామచంద్రాపురం, వెలుగు : ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి యువకుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.  రామచంద్రాపురం పరిధి భారతీ నగర్ డివిజన్ ఎల్ఐజీ కాలనీలోని క్వార్టర్ నంబర్ –169లో భాస్కర్ కుటుంబం ఉంటుంది. గురువారం  రాత్రి కిచెన్ లో గ్యాస్ సిలిండర్ అయించది దీంతో భాస్కర్ కొడుకు అనంత స్వరూప్ (22) వేరేది మార్చేందుకు వెళ్లాడు. 

సిలిండర్ మార్చాక లీకేజీని గమనించకపోవడంతో వాసన వస్తుండగా అనంత స్వరూప్ కుటుంబసభ్యులను బయటకు పంపించాడు.  ఆ వెంటనే  సిలిండర్  పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. తీవ్రంగా గాయపడ్డ స్వరూప్ ను ఆస్పత్రికి తరలించగా  చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.