కోటిలో ఒక్కడు.. దొరికిన డబ్బులు ఇచ్చేసి నిజాయితీ చాటుకున్నాడు

కోటిలో ఒక్కడు..  దొరికిన డబ్బులు ఇచ్చేసి నిజాయితీ చాటుకున్నాడు

మనం రోడ్డుపై వెళ్తుంటే డబ్బులు దొరికితే ఏం చేస్తాం.. తీసుకుని జేబులో వేసుకుని వెళ్లిపోతాం. కానీ ఈ డబ్బులు ఎవరివో తెలుసుకుని వారికిచ్చే నిజాయీతీపరులు ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారు.. బహుశా వెళ్లమీద లెక్కపెట్టోచ్చు . అలాంటి కోటి మందిలో ఒక్కడు ఈ  తిరుపతి.  ఇంతకీ ఏం జరిగదంటే..  మానకొండూరు మండలం కొండపల్కల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా... కొత్తపల్లి మండలంలోని చింతకుంట వద్ద  తన పర్సు,సర్టిఫికెట్లు పోగొట్టుకున్నాడు. అయితే అటు వైపు వెళ్తున్న తిరుపతికి ఇవి కనిపించాయి. అయితే తిరుపతి స్వార్ధంగా ఆలోచించకుండా... వెంటనే   కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయాన్ని చెప్పి దొరికిన వస్తువులను  వారికి అప్పగించాడు.  దీంతో తిరుపతి నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు అభినందిచారు.