రాజేంద్రనగర్ లో బైక్ ను ఢీకొన్న ట్యాంకర్.. వ్యక్తి మృతి

రాజేంద్రనగర్ లో బైక్ ను ఢీకొన్న ట్యాంకర్.. వ్యక్తి మృతి

రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ శివరాంపల్లి సమీపంలో ఓ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. 238 నెంబర్ మెట్రో పిల్లర్ వద్ద టూవీలర్ ను ఢీ కొట్టింది. దీంతో ట్యాంకర్ చక్రాల కింద టూవీలర్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి నలిగిపోయి ఘటనాస్థలంలోనే చనిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న  రాజేంద్రనగర్ పోలీసులు..ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి ఆరీఫ్ గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి అసలు కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ట్యాంకర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.