Video Viral:  అయోధ్య రాముడి కోతి సాష్ఠాంగ నమస్కారం... రోజూ అక్కడ జరిగేది ఇదే...

Video Viral:  అయోధ్య రాముడి కోతి సాష్ఠాంగ నమస్కారం... రోజూ అక్కడ జరిగేది ఇదే...

పవిత్ర నగరమైన అయోధ్యలోని ఒక ఆలయంలో  ఒక కోతి వచ్చి పూజలు చేయడం సర్వత్ర విస్తు పోయేలా చేస్తుంది.  ఆ కోతి ప్రతిరోజూ ఈ గుడికి వెళ్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి రోజు ఓ వానరం స్వామిని దర్శించుకొని వెళ్తుందనే వార్త వైరల్​ గా మారింది. ఈ వీడియో పాతదని అంటున్నారు.. అయినప్పటికీ నెట్టింట మరోమారు దూసుకుపోతోంది. నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది.

హిందువులు వానరాలను ఆంజనేయ స్వామికి ప్రతి రూపంగా ఆరాధిస్తుంటారు. ఎక్కడ కనిపించినా వాటిని అంతే భక్తితో ఆరాధిస్తుంటారు. . కోతులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో పురాణాలు చెప్పేవి నిజమేమో అని అనిపిస్తుంటుంది.  అయోధ్యలో బాలక్​ రామ్​ విగ్రహం ప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి ఓ వానరం ( ఆంజనేయస్వామి) రోజు అయోధ్య దేవాలయానికి వస్తుందనే వార్త సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది.  ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కోతి ప్రవర్తన చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. రోజూ ఆర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించే కోతి.. అడుగడుగుకూ దండాలు పెడుతూ దేవుడిని భక్తితో వేడుకుంటోంది. చాలా కాలం క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

ఓ కోతి అర్ధరాత్రి వేళ ఆలయానికి (temple) చేరుకుంటుంది. వచ్చే ముందు మధ్య మధ్యలో ఆగుతూ దేవుడికి దండాలు (Praying to God) పెడుతూ వస్తుంది. ఆలయ మెట్లు ఎక్కి లోపలికి వెళ్లే ముందు.. సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న కుక్క కోతిని గమనిస్తుంది.

అయినా ఇవేవీ పట్టించుకోని కోతి.. లోపలికి వెళ్లి కొద్ది సేపు మౌనంగా కూర్చుంటుంది. కాసేపటి తర్వాత కుక్క (dog) అక్కడికి వచ్చి కోతిని చూసి గట్టిగా మొరుగుతుంది. అయినా భయపడని కోతి.. ఇక్కడి నుంచి వెళ్లిపో.. అన్నట్లుగా దాన్ని ప్రతిఘటిస్తుంది. దెబ్బకు కుక్క అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత పక్కనే ఉన్న దేవుడి విగ్రహానికి ఎదురుగా చాలా సేపు సాష్టాంగ నమస్కారం చేస్తూ.. ఆశీర్వదించమని అడుగుతున్నట్లుగా దేవున్ని వేడుకుంటుంది.

రామభక్తుడిగా మారిన హనుమంతుడికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులున్నారు. అయోధ్య అంటే రామజన్మభూమిగా ప్రసిద్ధి. రాముడితో పాటు భక్తులకు ఆంజనేయుడు కూడా గుర్తుకువస్తాడు. రామునిపై అపరిమితమైన భక్తి ఉన్నవాడు హనుమంతుడు. భక్తికి నిర్వచనం హనుమంతుడు.. ప్రస్తుతం అయోధ్యలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది.
సాత్విక్ సోల్ అనే ట్విట్టర్ యూజ‌ర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్‌ వీడియోలో ఒక కోతి కొండ‌పైన ఉన్న గుడికి వెళ్లి దేవుడికి మొక్కడం క‌నిపిస్తుంది. ప్రతిరోజూ రాత్రి స‌మ‌యంలో కోతి ఆల‌యాన్ని సంద‌ర్శిస్తోంద‌ని వీడియోను షేర్ చేసిన యూజ‌ర్ రాసుకొచ్చారు.

అయోధ్య బాలరాముడి ఆలయంలోకి  ఓ కోతి ప్రవేశించింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మర్నాడే ( జనవరి 23) ఈ ఘటన చోటుచేసుకోవడంతో హనుమంతుడిగా భక్తులు భావిస్తున్నారు. గర్భగుడిలోకి దక్షిణ ద్వారం గుండా ప్రవేశించిన వానరం.. విగ్రహం వద్దకు చేరుకుంది. అనుకోని అతిథి రాకతో మొదట్లో ఆందోళనకు గురైన భద్రతా సిబ్బంది.. విగ్రహానికి హాని కలిగిస్తుందేమోననే భయంతో కోతిని పట్టుకునే ప్రయత్నం చేసినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.