
జీడిమెట్లలో దారుణం జరిగింది. కన్న కుమారుడిని కొట్టి చంపింది ఓ తల్లి. భర్తను కాదని బాలుడితో పాటు కొన్ని రోజులుగా భగత్ సింగ్ నగర్లో వేరే వ్యక్తితో నివాసం ఉంటుంది తల్లి. అయితే భర్తపై కోపంతో ఇవాళ బాలుడు ఉమేశ్ ను తీవ్రంగా కొట్టింది తల్లి. అనంతరం సురారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. తన భార్య, భాస్కర్ అనే వ్యక్తి కలిసి తన కొడుకును కొట్టి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త సురేష్. వారి పెళ్లికి తన కొడుకు అడ్డుగా ఉన్నాడనే చంపారని ఆరోపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.