ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండలం రామాపురంలో దారుణ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన పోలిశెట్టి మౌనిక ఏం కష్టమొచ్చిందో కాని తన ఇద్దరు పిల్లలను ఉరి వేసి చంపి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానాలు ఉన్నాయి. మౌనిక భర్త శ్రీనాధ్ ఆర్ఎంపీ.  గ్రామంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో  వారికి ఆర్ఎంపి వైద్యుడుగా సేవలు అందిస్తుంటాడు. ఆదివారం ఓ పేషేంట్ తీసుకొని ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంటికి తిరిగి వచ్చి చూసే లోపు భార్య మౌనిక, ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.