ముఖ్యమంత్రి అభ్యర్ధిపై చెప్పులతో దాడి..జోస్యం చెప్పిన తేజస్వీ

ముఖ్యమంత్రి అభ్యర్ధిపై చెప్పులతో దాడి..జోస్యం చెప్పిన తేజస్వీ

అదృష్టం వరిస్తే కాబోయే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అతనే. కానీ ముఖ్యమంత్రి పదవి సంగతి అటుంచితే..ఓటర్లో, ప్రత్యర్ధులో సదరు ముఖ్యమంత్రి అభ్యర్ధిపై చెప్పులతో దాడి చేశారు. ఈ దాడి ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన  రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ ప్రచారం నిర్వహించింది. ఆ పార్టీ తరుపున ముఖ్యమంత్రిగా అభ్యర్ధి లాలూ ప్రసాద్ కొడుడు   తేజస్వీ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఔరంగాబాద్ లోని కుటంబ నియోజకవర్గంలో తేజస్వీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగా..జనంలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పై చెప్పులతో దాడి చేశారు.

అయినా సరే తన ప్రసంగాన్ని కొనసాగించారు. పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో. ప్రతీ ఒక్కరు మార్పు, అభివృద్ధి, ఉద్యోగం కోరుకుంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం గత 15ఏళ్ల నుంచి బీహార్ ను అభివృద్ధి చేయడం విఫలమైంది. బీహార్లో జరిగే రాజకీయ యుద్ధంలో ఓటమిపాలవుతున్నామని ఎన్డీయే అభ్యర్ధులు ఫీలవుతున్నారని  బీహార్ ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్ధి తేజస్వీ జోస్యం చెప్పారు.