భార్య ఎదుటే భర్త గల్లంతు

భార్య ఎదుటే భర్త గల్లంతు

వాగు దాటుతుండగా భార్య ఎదుటే భర్త గల్లంతయ్యాడు. వరంగల్​ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు బుక్య ముత్యాలు, శంకర్(62) బుధవారం మధ్యాహ్నం పొలం పనులకు బయలుదేరారు. దారి మధ్యలో ఉన్న వట్టేవాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో శంకర్ ​ముందుగా ముత్యాలును ఒడ్డుకు చేర్చాడు. అనంతరం శంకర్​ వెనక్కి వచ్చి పొలం పనులకు సంబంధించిన సామగ్రి తీసుకుని వాగు దాటుతుండగా నీటి ప్రవాహం పెరిగింది. దాంతో వాగులో కొట్టుకుపోయాడు. ముత్యాలు అరుపులు విని తండావాసులు వచ్చి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.