టైమ్ మ్యాగజైన్ లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి చోటు

టైమ్ మ్యాగజైన్ లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి చోటు

గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’కి అరుదైన గుర్తింపు దక్కింది. 2019-టైమ్ మ్యాగజైన్ లో స్టాచ్యూ ఆఫ్ యూనిటికి చోటు దక్కింది. ప్రపంచ మహోన్నత సందర్శనీయమైన 100 ప్రదేశాలు పేరిట రూపొందించిన లిస్టులో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిలిచింది. 182 మీటర్లతో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టించిన ఉక్కుమనిషి విగ్రహం గతేడాది ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా బాగా ఫేమస్ అయ్యింది.

టైమ్ మ్యాగజైన్ లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి చోటు దక్కడంతో ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. ‘కొద్ది రోజుల క్రితం ఒక్క రోజే స్టాచ్యూ ఆఫ్ యూనిటీని 34 వేల మంది సందర్శించారని..ఇప్పుడు టైమ్ మ్యాగజైన్ లో చోటు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.