ఇదేందిదీ.. కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్‌!

ఇదేందిదీ.. కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్‌!

అమెరికాలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొంది. ఈ ఘటన టెక్సాస్‌ రాష్ట్రంలోని మెక్‌కిన్నేలో జరిగింది. శనివారం (నవంబర్ 11న) మధ్యాహ్నం ఏరో కౌంటీ ఎయిర్‌పోర్టులో ఓ బుల్లి లాన్సర్‌ Iv-P ప్రాప్‌జెట్‌ విమానం రన్‌వే పై నుంచి టేకాఫ్‌ అయ్యింది. కానీ.. వెంటనే దానిని పైలట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఆ విమానం రన్‌వేపై చివరి వరకు వచ్చినా ఆగలేదు. 

అక్కడే ఉన్న కంచెను దాటుకొని రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొంది. వెంటనే అత్యవసర సహాయక బృందాలు అలర్ట్ అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్నాయి. పైలట్‌, ప్రయాణికుడు, కారు డ్రైవర్‌ను రక్షించాయి. వీరిలో ఒకరికి స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై అమెరికాలోని ఫెడరల్‌ ఏవియేషన్‌ అథారిటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డును మూసివేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.