
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఏడో వార్డు తిరుమల కాలనీ లో జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణం ఆపించాలని కోరుతూ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ రాజును కలిసి మెమోరాండం అందజేశారు. కాలనీవాసులు మాట్లాడుతూ.. ఏడో వార్డు పరిధిలోని పాత జ్ఞానజ్యోతి స్కూల్ దగ్గర రుద్ర సురేందర్ ఇంటిపైన ఎయిర్ టెల్ సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నారు. జనావాసాల మధ్య నిర్మించడం వల్ల భవిష్యత్తులో ప్రజలు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని అన్నారు. కమిషనర్ స్పందించి సెల్ టవర్ నిర్మాణం ఆపివేయించాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు ఖాందేశ్ ప్రశాంత్, సాయన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.