అఫ్జల్‌గంజ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం

 అఫ్జల్‌గంజ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌ : అఫ్జల్‌గంజ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారికి ప్రస్తుతం డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై విచారిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత గంటల తరబడి రోడ్డుపైనే కారు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు.