జోగులాంబ అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే చీర

జోగులాంబ అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే చీర

రాజన్నసిరిసిల్ల, వెలుగు: గద్వాల ఆలంపూర్ జోగులాంబ అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చేనేత కళాకారుడు బుధవారం  అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్దండి హరిప్రసాద్ ఆరు రోజులు శ్రమించి చేనేత మగ్గంపై ఈ చీరను నేశారు. దీనికి 2 గ్రాములు బంగారం, పట్టుదారాన్ని వినియోగించారు. చీర ఐదున్నర మీటర్ల పొడవు,48 ఇంచుల వెడల్పుతో రూపొందించారు. కొంగు,అంచులు గులాబీ, చీర గోల్డ్ రంగులో నేసాడు. చీర 150 గ్రాముల బరువుతో ఉంది.