ఢిల్లీలో ఏడేండ్ల బాలికకు వృద్ధుడి వేధింపులు

ఢిల్లీలో ఏడేండ్ల బాలికకు వృద్ధుడి వేధింపులు

బెగూసరాయ్/న్యూఢిల్లీ: హోలీ రోజు బీహార్​లోని బెగూసరాయ్  జిల్లాలో ఘోరం జరిగింది. ఏడేండ్ల బాలికను ఒకడు రేప్  చేశాడు. అంతేకాకుండా ఆమె ఫ్రెండ్ పైనా అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బెగూసరాయ్  జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధిత చిన్నారులు హోలీ రోజు మార్కెట్  నుంచి  ఇంటికి వెళ్తున్నారు. అయితే మార్గ మధ్యలో ఓ స్కూల్ పక్కన ఊయల ఊగి ఇంటికెళ్దామని అక్కడే ఆగారు. ఆ టైమ్​లో ఛోటూ కుమార్ అనే వ్యక్తి బాలికల దగ్గరికెళ్లి వారిద్దరిని స్కూల్  టాయిలెట్​లోకి లాక్కెళ్లాడు. అక్కడ ఓ బాలికపై అత్యాచారం చేశాడు. మరో బాలికను కూడా బుగ్గలపై కొరికి, రేప్  చేయడానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించి తప్పించుకుంది. స్థానికులకు విషయం తెలపడంతో వారు స్కూల్​కు వెళ్లి చూడగా ఆమె ఫ్రెండ్​ను ఛోటూ పొదల పక్కన పారేసి పరారయ్యాడు. గ్రామస్థులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టుచేసి విచారిస్తున్నామని చెప్పారు.

ఢిల్లీలో ఏడేండ్ల బాలికకు వృద్ధుడి వేధింపులు

ఢిల్లీలో ఏడేండ్ల బాలికపై పొరుగున ఉన్న 60 ఏండ్ల వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తల్లి వెళ్లి నిందితుడిని నిలదీయగా.. నిందితుడు గొడవ కు దిగాడు. దీంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.