ఇంటర్ హాస్టల్ లో పాము కలకలం

ఇంటర్ హాస్టల్ లో పాము కలకలం

నవాబుపేట, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట మండలంలోని యన్మన్​గండ్ల బీసీ ఇంటర్​గర్ల్స్ హాస్టల్​లో గురువారం పాము కలకలం సృష్టించింది. ఉదయం హాస్టల్​గోడపై చెడుగు కనబడడంతో విద్యార్థులంతా అరుస్తూ పరుగులు తీశారు. ఈ గందరగోళంలో ఫస్టియర్​ చదువుతున్న మమత అనే విద్యార్థిని వీపుపై పడడంతో ఆమె భయపడింది. విదిలించగా మరో నలుగురిపై పడిన చెడుగు ఎటో వెళ్లిపోయింది. కాలేజీలో పరీక్ష రాయడానికి వెళ్లిన మమత సాయంత్రం హాస్టల్​కు తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురై  స్పృహ తప్పి పడిపోయింది.

రెగ్యులర్​వార్డెన్​ మెడికల్​ లీవ్​లో ఉండడం, అధికారులు, హాస్టల్​వర్కర్లు అందుబాటులో లేకపోవడంతో కాలేజీ లెక్చరర్లు,  గ్రామస్తులు కలిసి ఆమెను ప్రైవేటు వాహనంలో జిల్లా హాస్పిటల్​కు తరలించారు. నోటి నుంచి నురగ లాంటిది వచ్చిందని చెబుతున్నారు. రాత్రి వేళలో బాలికకు స్పృహ వచ్చినా స్పర్శ తెలియడం లేదని చెబుతోంది.