బస్సును ఢీకొట్టగానే.. కారులో మంటలు

బస్సును ఢీకొట్టగానే.. కారులో మంటలు

బెంగుళూరులో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. సోమవారం (డిసెంబర్ 4) ఉదయం నాగరభావి ప్రధాన రహదారిలోని చంద్రా లేఅవుట్ బస్టాండ్ వద్ద... ఓ కారు అతివేగంగా వచ్చి.. నిలిచి ఉన్న బస్సును ఢీకొంది. దీంతో వెంటనే కారులో నుంచి మంటలు భారీగా ఎగసిపడ్డాయి. 

బీఎంటీసీ(బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) బస్సులోని ప్రయాణికులు భయంలో బయటకు పరుగులు తీశారు. బస్సు డ్రైవర్ గౌరీష్ .. యశ్వంత్‌పురా నుండి నాయందహల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్‌స్టాప్‌లో ప్రయాణికులు ఎక్కుతుండగా వేగంగా వచ్చిన కారు.. బస్సు వెనుక వైపు ఢీకొంది. వెంటనే కారులో ఉన్నవారితో పాటు బస్సులోని ప్రయాణికులు కూడా బయటకు దూకారు. ప్రయాణికులు అలర్ట్ గా లేకపోయి ఉంటే.. పెను ప్రమాదం జరిగి ఉండేది. ఈ ఘటనలో కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. బస్సు పాక్షికంగా దగ్ధమైంది. అయితే ప్రయాణికులందరూ వెంటనే బస్సు నుండి కిందికి దిగి పోయారు.