ఫ్లైట్లో సాంకేతిక లోపం..అత్యవసర ల్యాండింగ్

ఫ్లైట్లో సాంకేతిక లోపం..అత్యవసర ల్యాండింగ్

పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. పాట్నా నుంచి టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగాయి.  ఫ్లైట్ టేకాఫ్ అయిన సమయంలో లెఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఓ పక్షి ఢీకొట్టడంతో  మంటలు చెలరేగాయి.  దీన్ని గమనించిన పైలెట్..వెంటనే పాట్నా ఎయిర్ పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ లాండ్ చేశాడు.

ఆ సమయంలో విమానంలో 185 మంది ప్రయాణికులున్నారు. వీరంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.సమాచారం అందుకున్న  పాట్నా డిఎంతో సహా ఉన్నతాధికారులందరూ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

 పక్షి ఢీకొట్టడం వల్లనే మంటలు వచ్చినట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారి తెలియజేశారు. ఈ విషయాన్ని గమనించిన పైలెట్ వెంటనే ఇంజన్ ను ఆపేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఫ్లైట్ ను సురక్షితంగాల్యాండ్ చేసినట్లు తెలిపారు.