నిజామాబాద్ లో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య

నిజామాబాద్ లో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలోని మెడికల్ కాలేజీలో దారుణం జరిగింది. ఫైనలియర్ స్టూడెంట్ దాసరి హర్ష హాస్టల్​ రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కొద్దిరోజులుగా వెన్నెముక సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న వన్​ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే విద్యార్థి ఆత్మహత్యపై అతని కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా దాసరి హర్ష స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామం.