ప్రభుత్వ స్కూల్​లో స్టూడెంట్​కు ​పాము కాటు

ప్రభుత్వ స్కూల్​లో స్టూడెంట్​కు ​పాము కాటు

ప్రభుత్వ స్కూల్​లో స్టూడెంట్​కు ​పాము కాటు
హాస్పిటల్​కు తరలింపు 
రంగారెడ్డి జిల్లా ఎల్కిచర్లలో ఘటన

షాద్ నగర్, వెలుగు : గవర్నమెంట్​స్కూల్​లో ఓ స్టూడెంట్​ను పాము కాటేసింది. రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండలం పెద్దఎల్కిచర్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అనసూయ, రాజు దంపతుల కూతురు అక్షయ(8) స్థానిక ప్రైమరీ స్కూల్​లో మూడో తరగతి చదువుతోంది. రోజుమాదిరిగానే మంగళవారం ఉదయం స్కూల్​కు వెళ్లిన అక్షయ.. ఇంటర్వెల్ లో టాయిలెట్స్ వైపు వెళ్తూ అక్కడ చెట్లల్లో ఉన్న పాముపై కాలు వేసింది. వెంటనే పాము అక్షయ కాలిపై రెండు చోట్ల కాటేసింది. వెంటనే గమనించిన స్కూల్​స్టాఫ్​పామును చంపేసి, అక్షయ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే వచ్చి అక్షయను చికిత్సకోసం కొందుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ఫస్ట్ ఎయిడ్​ చేసి, మెరుగైన వైద్యం కోసం నిలోఫర్ కు తీసుకెళ్లారు. కాగా, స్కూల్​లో టాయిలెట్స్ శిథిలావస్థకు చేరాయని, గడ్డి మొక్కలు పెరిగి విషపురుగులకు స్థావరంగా మారిందని, సరైన మెయింటెనెన్స్ లేకనే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు స్పందించి స్కూల్​లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.