BlueMoon: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేస్తున్న సూపర్ బ్లూ మూన్

BlueMoon: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేస్తున్న సూపర్ బ్లూ మూన్

దేశంలోని  పలు ప్రాంతాల్లో సూపర్ బ్లూ మూన్  ఆవిష్కృతమైంది. లక్నో, న్యూ ఢిల్లీ,  ముంబై, బీహార్ లోని పాట్నా జంక్షన్ రైల్వేష్టేషన్ సమీపంలో సూపర్ బ్లూ మూన్ కనిపించగా సాధారణం కంటే  ఎక్కువ ప్రకాశవంతంగా, పెద్దగా చంద్రుడు కనువిందు చేశాడు. ఈ సూపర్ బ్లూ మూన్ వీక్షేందుకు ప్రజలు భారీ సంఖ్యలో ఆసక్తి చూపిస్తుండగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.  

ఈ సూపర్ బ్లూ మూన్ ఆగస్ట్ 31 తెల్లవారుజామున 3 గంటల  36 నిమిషాల వరకు  ఉంటుంది. చివరిసారిగా బ్లూ బూన్‌ 2009 డిసెంబర్‌లో ఏర్పడింది.  మళ్లీ ఆగస్టు 30వ తేదీన ఏర్పడుతుంది. మళ్లీ  2032, 2037 ఆగస్టులో ఏర్పడబోతుంది.