అల్ర్టాహైస్పీడ్​ కమ్యూనికేషన్ ని సాధించిన చైనా పరిశోధకుల బృందం..

అల్ర్టాహైస్పీడ్​ కమ్యూనికేషన్ ని సాధించిన చైనా పరిశోధకుల బృందం..

చైనా పరిశోధకుల బృందం 6 జీ సాయంతో మొదటి సారి వైర్ లెస్​ ట్రాన్స్​మిషన్ అల్ర్టా హైస్పీడ్​ కమ్యూనికేషన్​ను సాధించింది. చైనా ఏరోస్పేస్​ సైన్స్​ అండ్​ ఇండస్ట్రీ కార్పొరేషన్​ కి చెందిన పరిశోధన బృందం టెరాహెర్జ్ట్​ ఆర్బిటల్​ యాంగ్యులర్​ మొమెంటం కమ్యూనికేషన్​ టెక్నాలజీని ఇందుకు ఉపయోగించింది.  ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఉన్న 5 జీ సేవల కంటే 10‌‌‌‌–20 రెట్లు వేగవంతమైంది.  దీని ఫ్రీక్వెన్సీ 100 గిగా హెడ్జ్​ – 10 టెరా హెడ్జ్​గా ఉంది. ఈ ప్రయోగంలో 110 గిగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీలోని నాలుగు వేర్వేరు బీమ్​ నమూనాలను రూపొందించడానికి యాంటెన్నాను ఉపయోగించారు. దాని సాయంతో బ్యాండ్​ విడ్త్​ వినియోగ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు.  

వేగంగా సమాచార బదిలీ..

ఈ సాంకేతికతతో సమాచారం బదిలీ చేయడంలో వేగం పెరుగుతుంది. ఇది ల్యూనార్​, మార్స్​ ల్యాండర్​ల మధ్య హైస్పీడ్​ కమ్యూనికేషన్​ జరిగేలా చూస్తుంది. భవిష్యత్తులో, 6Gని ఉపయోగించి పీక్ కమ్యూనికేషన్ వేగం సెకనుకు ఒక టెరాబిట్‌కు చేరుకుంటుంది.