V6 News

భద్రాద్రికొత్తగూడెంలో భానుడి భగ భగలు

భద్రాద్రికొత్తగూడెంలో భానుడి భగ భగలు
  • ఏడూళ్ల బయ్యారంలో 44.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా భానుడి భగభగలతో మండిపోతోంది. జిల్లాలోని ఏడూళ్ల బయ్యారంలో గురువారం అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత మూడు–నాలుగు రోజులుగా జిల్లావ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లక్ష్మీదేవిపల్లిలో 43.8 డిగ్రీలు, భద్రాచలంలో 43.7 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే సత్యనారాయణపురం, కరకగూడెం, మణుగూరు ప్రాంతాల్లో 43.6 డిగ్రీలు, అశ్వాపురంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం జిల్లావ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.