
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంది మండలం తునికిళ్ల తండాలోని నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై లారీ వెనక నుంచి వచ్చి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతులు అభిషేక్, సందీప్, నవీన్ గా గుర్తించారు. పుల్కల్ మండలం ఇసాజి పేట,గంగోజి పేట గ్రామానికి చెందిన వారిగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.