బిస్కెట్‌‌‌‌ ఫ్యాక్టరీ మెషీన్‌‌‌‌లో పడి మూడేండ్ల బాలుడు మృతి

బిస్కెట్‌‌‌‌ ఫ్యాక్టరీ మెషీన్‌‌‌‌లో పడి మూడేండ్ల బాలుడు మృతి

థానే : బిస్కెట్‌‌‌‌ ఫ్యాక్టరీలోని మెషీన్‌‌‌‌ బెల్ట్‌‌‌‌లో చిక్కుకొని మూడేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని అంబర్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌లో జరిగింది. ఆయుష్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ (3) అనే బాలుడిని తన తల్లి బుధవారం బిస్కెట్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చింది. బాలుడి తల్లి కంపెనీ స్టాఫ్‌‌‌‌కు టిఫిన్‌‌‌‌ బాక్స్‌‌‌‌లు సప్లయ్ చేస్తుండగా, రన్నింగ్‌‌‌‌లో ఉన్న మెషీన్‌‌‌‌ బెల్ట్‌‌‌‌పై పడిన బిస్కెట్‌‌‌‌ను తీసుకునేందుకు ఆయుష్‌‌‌‌ ప్రయత్నించాడు. 

దీంతో బాలుడు ప్రమాదవశాత్తు ఆ బెల్ట్‌‌‌‌లో చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న కార్మికులు వెంటనే మెషీన్‌‌‌‌ను ఆఫ్‌‌‌‌ చేసి, బాలుడిని రక్షించారు. తర్వాత హాస్పిటల్‌‌‌‌కు తరలించగా, బాలుడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అనంతరం ఆయుష్‌‌‌‌ను పోస్ట్‌‌‌‌మార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.