ఎన్నికల వేళ నగదు కట్టలపాములు బయటకు వస్తున్నాయి. ఇండియాలో ఎన్నికల్లో డబ్బు ఎంత ప్రభావం చూపుతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నోట్లు వెదజల్లి ఓట్లు కొల్లగొట్టేందుకు అన్ని పార్టీల నాయకులు పోటీపడుతున్నారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో దేశమంతటా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మార్చి 25 నాటికి ఈ తనిఖీల్లో రూ.540కోట్లకు పైగా భారీ నగదు పట్టుబడింది.
ఎన్నికల్లో గెలుపును పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పలు రాష్ట్రాల్లో అత్యంత భారీస్థాయిలో నగదు ప్రవాహం జరుగుతోంది. తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే టాప్ 3లో ఉన్నాయి. ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, నిఘా సంస్థలు, పోలీసులు, వాటి అనుబంధ సంస్థలు దేశమంతటా జరుపుతున్న తనిఖీల్లో ఈ డబ్బు పట్టుబడుతోంది.
నగదుతో పాటు… మద్యం, బంగారం లాంటి విలువైన సరుకును పెద్దసంఖ్యలోనే సీజ్ చేస్తున్నారు పోలీసులు.
