లైవ్‌లోనే కుర్రాడి చెంప చెల్లుమ‌నిపించిన జ‌ర్నలిస్ట్‌

లైవ్‌లోనే కుర్రాడి చెంప చెల్లుమ‌నిపించిన జ‌ర్నలిస్ట్‌

పాకిస్తాన్ కు చెందిన ఓ టీవీ జర్నలిస్టు మైరా హష్మీ లైవ్ ఇస్తుండగానే ఓ పిల్లాడి చెంప చెల్లుమనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈద్ అల్ అదా వేడుకలపై మైరా హష్మీ లైవ్ క‌వ‌రేజీ ఇస్తున్నారు. ఆమె చుట్టూ జ‌నం గుమిగూడి ఉన్నారు. ఆమె మాట్లాడుతూ ఉండ‌గా మ‌ధ్యలో ఒక్కసారిగా ముందున్న కుర్రాడి చెంప‌చెల్లుమ‌నిపించింది. దీంతో అక్కడున్న వారంతా సైలెంట్ అయిపోయారు. ఆమెతో వెకిలిగా ప్రవ‌ర్తించినందుకే చెంపపై కొట్టిందని స్థానికులు చెప్పారు. అయితే.. కొందరు మైరా హష్మీకి సపోర్టు చేస్తుంటే మరికొందరు కుర్రాడికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వ్యక్తి కూడా ఆమె ఎందుకు కొట్టిందో కారణం చెప్పలేదు. 

తన పేరు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండడంతో మైరా హష్మీ స్పందించారు. లైవ్ ఇస్తుండగా ఆ కుర్రాడు పక్కనే ఉన్న ఓ కుటుంబాన్ని వేధిస్తున్నాడని, ఇది వాళ్లను ఇబ్బందికి గురి చేసిందని చెప్పారు. అలా చేయొద్దని ముందుగా ఆ కుర్రాడికి ప్రేమతో చెప్పానని, అయినా మరింత అల్లరి చేస్తూ విసిగించాడని, దాంతో కోపంతో తన చెంపపై కొట్టాల్సి వచ్చిందని మైరా హష్మీ ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు.