ఢిల్లీలో గోడకూలి నలుగురు దుర్మరణం 

ఢిల్లీలో గోడకూలి నలుగురు దుర్మరణం 

దేశ రాజధాని ఢిల్లీలో విషాదం నెలకొంది. అలీపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ గోదాముకు చెందిన గోడ శుక్రవారం (జులై 15న) కుప్పకూలింది. విషయం తెలియగానే వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గోడ కూలిన ఘటనలో నలుగురు మృతిచెందారని పోలీసులు వెల్లడించారు.

గోడ కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.