కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు అనుపమ పరమేశ్వరన్

 కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు అనుపమ పరమేశ్వరన్

‘18 పేజెస్‌‌‌‌’ చిత్రం విడుదలై వారం తిరక్కముందే మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది అనుపమ పరమేశ్వరన్. ఆమె లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటించిన చిత్రం ‘బటర్‌‌‌‌‌‌‌‌ ఫ్లై’. భూమికా చావ్లా, రావు రమేష్, నిహాల్ కోదాటి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఘంటా సతీష్ బాబు దర్శకుడు. రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఈ నెల 29న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో అనుపమ మాట్లాడుతూ ‘కిందటేడాది ఇదే డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించాం. ఇందులో నేను గీత అనే పాత్రలో కనిపిస్తా. ఎమోషనల్ క్యారెక్టర్ కావడంతో చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. 

ఇన్వాల్వ్ అయి చేశాను. ఈ ఏడాది సెకెండాఫ్‌‌‌‌లో విడుదలైన కార్తికేయ 2, 18 పేజెస్‌‌‌‌ చిత్రాలు హిట్ అయ్యాయి. ఓటీటీలో వస్తోన్న ‘బటర్‌‌‌‌‌‌‌‌ ఫ్లై’ కూడా సక్సెస్ సాధిస్తుందని ఆశిస్తున్నా’ అంది. ‘ఇలాంటి ఓ మంచి చిత్రంలో అనుపమతో కలిసి నటించడం ఆనందంగా ఉంది’ అన్నాడు హీరో నిహాల్. ‘అనుపమ ఇందులో ఓ పాట పాడటం విశేషం’ అన్నాడు సంగీత దర్శకుడు అర్విజ్. ‘అనుపమ ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి మాకెంతో సపోర్ట్ చేశారు. ఆమె లేకుంటే ఈ సినిమా లేదు. కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రం అవుతుంది’ అని దర్శకనిర్మాతలు చెప్పారు.