
మహదేవపూర్, వెలుగు : పిడుగుపడి ఓ మహిళ చనిపోయింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఇసునం లక్ష్మి (46) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆదివారం పత్తి తీసేందుకు వెళ్లింది. చేనులో పత్తి తీస్తున్న టైంలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షంతో పాటు ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో లక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది. లక్ష్మికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.