
భైంసా, వెలుగు: విహారయాత్రకు నేపాల్వెళ్లిన మహిళ గుండెపోటుతో మృతి చెందారు. నిర్మల్‌జిల్లా భైంసా టౌన్‌కు చెందిన 12 జంటలు విహారయాత్రకు గతనెల 31న నేపాల్ వెళ్లాయి. తిరిగొస్తూ బిహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్ఏరియాలోని లాడ్జిలో బస చేసేందుకు ఆగారు. సోమవారం ఉదయం లాడ్జి పక్కన హోటల్లో టీ తాగుతుండగా బచ్చువార్సంగీత(41) ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయింది.
ఆమె భర్త మహేశ్‌తో కలిసి తోటి పర్యాటకులు సంగీతను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. విహారయాత్రలో విషాదం చోటు చేసుకోగా.. భార్య మృతితో భర్త విలపించిన తీరు స్థానికులకు కంటనీరు పెట్టించింది. మహిళ డెడ్ బాడీని అంబులెన్స్‌లో భైంసాకు తీసుకొచ్చారు.