
తల్లాడ, వెలుగు: డెంగ్యూతో మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. తల్లాడ మండల కేంద్రంలో సొసైటీ ఆఫీస్ ఏరియాలో ఉండే కందుల శ్రీదేవి(32) యోగా ట్రైనర్. ఆమె కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతుండగా.. తల్లాడ పీహెచ్ సీలో చికిత్స చేయించుకున్నా తగ్గలేదు. మంగళవారం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ గురువారం చనిపోయింది. టెస్ట్ లో ఆమెకు డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతురాలి కూతురు యశశ్రీ, మేనల్లుడు నిషాల్ కూడా డెంగీ లక్షణాలతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్టు చెప్పారు. మూడు రోజుల కింద తల్లాడ పీహెచ్ సీలో శ్రీదేవికి టెస్టులు చేయగా ప్లేట్ లెట్స్ 2.60 లక్షలు ఉన్నాయని, అస్తమా, గ్యాస్టిక్ ప్రాబ్లమ్ తో బాధపడుతుండడంతో పాటు జ్వరం ఎక్కువగా ఉందని పీహెచ్ సీ డాక్టర్ రత్న మనోహర్ తెలిపారు.