ఎస్ఐ కొట్టాడని..ఎలుకల మందు తాగుతూ యువకుడి సెల్ఫీ వీడియో

ఎస్ఐ కొట్టాడని..ఎలుకల మందు తాగుతూ యువకుడి సెల్ఫీ వీడియో

జగిత్యాల జిల్లాలో ఎస్సై కొట్టాడని బండారి శ్రీనివాస్ అనే యువకుడు  ఆత్మహత్య యత్నం చేసుకోవడం కలకలం రేపింది. తన చావుకు మల్యాల  ఎస్ఐ  నరేష్ కారణమని  విడుదల చేసిన సెల్ఫీ వీడియో సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఎలుకల మందు తాగిన ఆ యువకుడు ప్రస్తుతం కరీంనగర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 సెల్ఫీ వీడియోలో బాధితుడు బండారి శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం అసలేం రిగిందంటే.? సెప్టెంబర్ 12  చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ప్రశ్నిస్తూ మా ఊరికి వేయిస్తానన్న బస్సు ఏది ఎమ్మెల్యే గారూ' అంటూ సోషల్ మీడియాలో నేను  పోస్టు పెట్టిన.  దీనిపై మల్యాల మండలం నాచుపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త చెవులమద్ది శ్రీనివాస్ నాకు ఫోన్ చేసి బెదిరించాడు.  సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంపై  మల్యాల పోలీస్ స్టేషన్ లోనూ మద్ది శ్రీనివాస్ నాపై  ఫిర్యాదు చేశాడు.  నన్ను అరెస్ట్ చేసి మల్యాల పోలీస్ స్టేషన్ కు తరలించి ఎస్ఐ నరేశ్ నన్ను తీవ్రంగా కొట్టాడు. ఎస్ఐ కొట్టిన దెబ్బలకు అవమానకనంగా భావించి, ఎలుకల మందు తాగుతున్నా. నా చావుకు మల్యాల ఎస్ఐ నరేశ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మద్ది శ్రీనివాస్ కారణమని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు బాధితుడు బండారి శ్రీనివాస్. ఈ విషయం తెలిసిన స్థానికులు, పోలీసులు  ఎలుకల మందు తాగిన బాధితుడిని  కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.