బైక్ పై డ్రాప్ చెయ్యమని.. ప్రియుడిని కత్తితో పొడిచి చంపిన ప్రేయసి

V6 Velugu Posted on Jan 12, 2021

ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిని హత్యచేసింది ఓ యువతి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.తాడేపల్లి గూడెం పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు, తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన గర్సికూటి పావని  రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఏడాది నుంచి తనతో పెళ్లికి నిరాకరిస్తున్న తాతాజీనాయుడిపై అనుమానం పెంచుకున్న పావని మనస్తాపం చెందింది. సోమవారం ఇద్దర కలిసి పంగిడి వెళ్ళారు .అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత తనను ఇంటిదగ్గర దింపాలని పావని తాతాజీనాయుడిని కోంది. బైక్ పై మలకపల్లి వెళ్తుండగా దారి మధ్యలో బైక్ పై వెనక కూర్చున్న పావని తన బ్యాగులో ఉన్న కత్తితో తాతాజీనాయుడు వీపుపై,తలపై పొడిచింది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రియుడిని హత్య చేసిన పావని అక్కడే కూర్చుంది.  స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tagged murder, lover, kovvuru, westgodavari

Latest Videos

Subscribe Now

More News