
ముంబై నుంచి హైదరాబాద కు వచ్చి డ్రగ్స్ విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతున్న యువతిని చాదర్‌ఘాట్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు కలిసి అరెస్టు చేశారు. నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద బస్సు దిగిన యువతి, నలుగురితో మాట్లాడుతుండగా వారి కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. దీంతో యువతితోపాటుగా నలుగురు విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
యువతి వద్ద ఉన్న 08 గ్రాముల డ్రగ్స్ ( యాంఫెటమిన్ ), 06 మొబైల్స్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఇంకా వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు మలక్‌పేట ఏసీపీ శ్యాంసుందర్ తెలిపారు. యువతితోపాటు డ్రగ్స్ కొనుగోలు చేసిన యువకులందరూ 21 సంవత్సరాల వయస్సు వారేనని... ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు.