డేటింగ్ యాప్ పరిచయం ఓయో రూమ్ వరకు తీసుకెళ్లింది.. మాదాపూర్లో యువకుడిపై మరో యువకుడి అఘాయిత్యం

డేటింగ్ యాప్ పరిచయం ఓయో రూమ్ వరకు తీసుకెళ్లింది.. మాదాపూర్లో యువకుడిపై మరో యువకుడి అఘాయిత్యం

సోషల్ మీడియా, యాప్స్ వచ్చిన తర్వాత క్రైమ్ వికృతరూపం దాల్చుతోంది. ఎవురు ఎవరిపై దాడులు చేస్తున్నారో.. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, లవర్స్ మధ్య చెప్పరాని ఘోరాలు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా యువకుడిపై మరో యువకుడు అఘాయిత్యాని ప్రయత్నించిన ఘటన సంచలనంగా మారింది. 

హైదరాబాద్ మాదాపూర్ లో ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. డేటింగ్ యాప్ ద్వారా ఒక యువకుడిని ట్రాప్ చేసిన మరో యువకుడు.. అఘాయిత్యానికి పాల్పడగా ఎలాగోలా తప్పించుకున్నాడు. దీంతో ఆ ఇన్సిడెంట్ గురించి అందరికీ చెప్పి పరువు తీస్తానని బెదిరించి డబ్బుసు వసూలు చేయటం ప్రారంభించాడు. పోలీసుల దృష్టికి వెళ్లిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రీండర్ గే డేటింగ్ యాప్ లో ఇద్దరు యువకులు చాటింగ్ చేసుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు వైద్యుడు. ఉద్దేశపూర్వకంగానే ఇద్దరూ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు. ఓయో రూమ్ కు వెళ్లిన తర్వాత.. డాక్టర్ పై అఘాయిత్యం చేయబోయాడు యువకుడు . డాక్టర్ నిరాకరించటంతో దాడి చేశాడు యువకుడు.

►ALSO READ | నా స్టోరీ అందరికీ పాఠం కావాలి.. ఒక్క నెలలో రూ.23 కోట్లు లాస్ అయిన బ్యాంక్ ఉద్యోగి ఆవేదన

డబ్బులు ఇవ్వకుంటే ఇద్దరం ప్రైవేట్ గా కలిసిన విషయాన్ని  ఇంట్లో చెబుతానని బెదిరించాడు. దీంతో భయపడి 5 వేల రూపాయలు చెల్లించాడు డాక్టర్. ఆ తర్వాత బయటపడిన డాక్టర్ ను బెదిరించడం మొదలుపెట్టాడు ఆ యువకుడు. 

డాక్టర్ ను ఫాలో అయిన యువకుడు.. నేరుగా ఆయన పనిచేస్తున్న హాస్పిటల్ కి వెళ్లి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయటంతో పోలీసులను ఆశ్రయించాడు వైద్యుడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలిస్తున్నారు.